– జులై 10న కోర్కెల దినం : టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీజేపీ అలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న కోర్కెల దినంగా పాటిస్తున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ-సీఐటీయూ అనుబంధం) తెలిపింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్, నర్సింగ్ నాయకులు భూలక్ష్మి సువర్ణలతతో పాటు నాయకులు బైరపాక శ్రీనివాస్ డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ కమిషనర్లను కలిసి డిమాండ్ డే రోజు చేపట్టబోయే నిరసనల గురించి తెలిపారు. సీఐటీయూ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జనరల్ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల వరకు అన్ని ఆస్పత్రుల వద్ద ఫ్లకార్డులు చేబూని నిరసనలు తెలుపుతామని చెప్పారు. జిల్లా, మండల కేంద్రాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాల్లోనూ ఉద్యోగులు పాల్గొంటారని వెల్లడించారు.