ప్రజాపాలనలో రైతన్నకు మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం: ప్రభుత్వ విప్ ఐలయ్య 

In public administration, we gave our word to the farmer... we kept it: Government Whip Ailaiahనవతెలంగాణ – తుర్కపల్లి 
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారంగా ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన కార్యక్రమం అని ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రైతుల కలసి సంబరాల్లో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు. చౌరస్తా నుండి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం బట్టివిక్రమార్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ఆలేరు నియోజకవర్గం రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షలు రుణమాఫీ అమలు చేస్తున్నదని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్టంలో రుణమాఫీని ఏడాదికి 25వేల చొప్పున నాలుగు విడతలుగా లక్ష రూపాయలు మాత్రమే అమలు చేసిందన్నారు. 2018లో మరో సారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేండ్లు అధికారంలో ఉన్నప్పటికీ రుణమాఫీ అమలు చేయలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని బిఆర్ఎస్ చేతిలో పెట్టినప్పటికీ రుణమాఫీనిఅమలు చేయడంలో వైఫల్యంచెందిన గత పాల కులు కాంగ్రెస్ అమలు చేస్తున్న రుణమాఫీపై అవాక్కులు చెవాకులు పేల్చడం, అభాండాలు మోపే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఆగస్టు 15లోగా మిగతా లక్ష రూపాయలు రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాల్లో తమ ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు.
రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్న ఈ రాష్ట్రంలో ఒకేసారి రూ.రెండు లక్షలు రుణమాఫీ చేయడం ఆర్థిక భారం అయినప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నిబద్ధ తకు నిదర్శనం అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. తెలుపు రేషన్ కార్డు ఉన్న రైతులకు మాత్రమే రుణమాఫీ అమలు చేస్తారని టీఆర్ఎస్, బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి ఇప్పటివరకు రూ.635 కోట్ల 52 లక్షలు విద్యుత్ సంస్థలకు చెల్లించిందన్నారు. రాజీవ్ ఆగ్యశ్రీ పథకం వల్ల ఏడు నెలల కాలంలో 40 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులకు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  కృతజ్ఞతలు తెలిపారు. మండల స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఏ ఏడి సురేష్ తాసిల్దార్ దేశ నాయక్ ఎంపీడీవో ఝాన్సీ లక్ష్మీబాయి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ వ్యవసాయ శాఖ ఏ పిడి పద్మావతి ఏవో దుర్గేశ్వరి పి ఏ సి ఎస్ చైర్మన్ నరసింహారెడ్డి నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అండం సంజీవరెడ్డి గుడిపాటి మధుసూదన్ రెడ్డి దానవాత్ శంకర్ నాయక్ చాడ భాస్కర్ రెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు చైతన్య మహేందర్ రెడ్డి వివిధ మండలాల నాయకులు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.