హానుమత్ సహిత శ్రీమద్రాజరాజేశ్వరి పంచాయతన ఆలయంలో

In Srimadrajarajeshwari panchayat temple with Hanumat– శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
నవతెలంగాణ – మల్హర్ రావు.
శ్రీ కోటి లలితాసహస్రనామపారాయణ, శతచండీపారాయణ సహితం శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం మండలంలోని పెద్దతూoడ్ల గ్రామంలోని శ్రీ హనుమత్ సహిత శ్రీ మద్రాజరాజేశ్వరీ పంచాయతన దేవాలయం,లో ప్రారంభమైన తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు గురువారం నుండి ఆశ్వయుజ శుక్ల నవమి,12 వరకు దేవాలయంలో లోకకళ్యాణార్ధం,గ్రామాభ్యుదయార్ధం శరన్నవరాత్రోత్సవాలు, కోటి లలితాసహస్రనామ జపయఙ్ఞంలో భాగంగా అయుత (పదివేలు) లలితసహస్రనామపారాయణం, శతచండీపారాయణం(సాంగం) జరుప విజ్ఞులు నిశ్చయించినట్లుగా తెలిపారు. ఈ దేవాలయం డైమండ్ జుబిలీ (75వ వార్షికోత్సవం) ఉత్సవసన్నాహాల్లో భాగంగా, పూజ్యగురువులు శ్రీ మోతేరాం విశ్వనాథం శిష్యబృందం నిర్వహిస్తున్న కోటిసహస్రనామపారాయణంలో(ఆ క్టోబర్ 3-2024 నుండి అక్టోబర్ 2′-2025 వరకు) మొదటి అడుగు. అలాగే పాడ్యమి ఉదయం నుండి నవమి ఉదయం వరకు నవాహోరాత్ర లలితాసహస్రనామపారాయణం నిరంతరం జరుగునట్లుగా తెలిపారు..
కార్యక్రమ వివరాలు ఇలా…
గురువారం (పాడ్యమి): ఉదయం 8-00 నుండి గణపతి పూజ, పుణ్యాహవాచనం, ద్వారపూజ, మందిరప్రవేశం, కలశస్థాపన, అఖండదీపస్థాపన, రక్షాబంధనం, షోడశస్తంభ పూజ, యోగినీ వేదికా స్థాపనం, నవగ్రహ, క్షేత్రపాలక, సర్వతోభద్రమండలస్థాపనం, బ్రహ్మకలశస్థాపన, శ్రీచక్రపూజ, పంచాయతన షోడశోపచారపూజ, గ్రామ శీతలాదేవికి హరిద్రాక్త నింబార్చనం, పంచదశ ఖడ్గమాల, లలితాసహస్రనామపారాయణము. నవాహోరాత్ర లలితాపారాయణం ప్రారంభం.
4న: శుక్రవారం (విదియ): శ్రీచక్రపూజ, పంచాయతన షోడశోపచారపూజ, పంచదశ ఖడ్గమాల, లలితా సహస్రనామపారాయణం మరియు హవనం హోమం: కుండాగ్ని సంస్కారం, అగ్నిప్రతిష్ఠ, ఆగమోక్త అగ్నిముఖం, గాయత్రీ హవనం
5న : శనివారం (తదియ అహోరాత్ర): శ్రీచక్రపూజ, పంచాయతన షోడశోపచారపూజ, లలితా సహస్రనామపారాయణం మరియు హవనం, కుమారీ పూజనం, సువాసినీ పూజనం
6న : ఆదివారం (తదియ): శ్రీచక్రపూజ, పంచాయతన షోడశోపచారపూజ, లలితా సహస్రనామపారాయణం మరియు హవనం.
7న : సోమవారం (చవితి, ఉపాంగ లలితా వ్రతం) శ్రీచక్రపూజ, పంచాయతన షోడశోపచారపూజ, పంచదశ ఖడ్గమాల, లలితా సహస్రనామపారాయణం మరియు హవనం, శతచండీ పారాయణం ప్రారంభం.
8న మంగళవారం(పంచమి): శ్రీచక్రపూజ, పంచాయతన షోడశోపచారపూజ, లలితా సహస్రనామపారాయణం మరియు హవనం, శ్రీపూర్తివిద్యా హవనం, అక్షయాస్తోమీయ హవనం శతచండీ పారాయణం (రెండవ రోజు) ద్విరావృత్తి పారాయణం.
9న : బుధవారం(షష్టి): శ్రీచక్రపూజ, పంచాయతన షోడశోపచారపూజ, సరస్వతీ హోమం, శ్యామలా, మాతంగీ హోమం, సరస్వతీ సహస్రనామ మరియు దశశ్లోకీ పారాయణములు. విద్యార్థులతో సరస్వతీ పూజ. లలితా సహస్రనామపారాయణం మరియు హవనం, శతచండీ పారాయణం (మూడవ రోజు) త్రిరావృత్తి పారాయణం.సాయంత్రం 6గం.లకు పల్లకీ సేవ, తదనంతరం మహాలింగార్చన.
10న : గురువారం (సప్తమి): శ్రీచక్రపూజ, పంచాయతన షోడశోపచారపూజ, లక్ష్మీ హవనం, లక్ష్మీ అష్టోత్తర, లలితా సహస్రనామపారాయణం మరియు హవనం. శతచండీ పారాయణం (నాలుగవ రోజు) చతురావృత్తి పారాయణం.
11న : శుక్రవారం (దుర్గాష్టమి): శ్రీచక్రపూజ, పంచాయతన షోడశోపచారపూజ, చండి హోమం, శతచండీ హోమ సమాప్తి దశాంశ హోమం. తర్పణ చండి, పుష్టి, తుష్టి, రక్షా, అభ్యుదయ హోమాలు, జయాదులు మరియు హవనోత్తరాంగం, లలితా సహస్రనామపారాయణం మరియు హవనం.
12న : శనివారం (మహర్నవమి) నవాహోరాత్ర లలితాపారాయణ కార్యక్రమం ముగింపు, శ్రీచక్రపూజ, దమనక పూజనం, పంచాయతనషోడశోపచారపూజ, మంగళాశీర్వచనం, స్వస్తి.ప్రతిదినం సాయంత్రం 7:00 నుండి భజన మరియు నిశిపూజ.ప్రతిదినం మధ్యాహ్నం 1:00 నుండి అన్నప్రసాద వితరణ జరుగును.
భక్తులు ఈ విశేష సేవలలో భక్తి ఉత్సాహాలతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి.లలితా పారాయణం చేసేవారికి విన్నపం. ప్రతిదినం పారాయణం రెండు విధాలుగ జరుగుతుంది. సామూహిక పారాయణం (ప్రతి రోజూ రెండుసార్లు)ఉదయం: 10,00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు. తర్వాత మధ్యాహ్న భోజనము,సాయంత్రం 4.00 నుండి 7.00 వరకు. తర్వాత సాయంత్రభోజనం/ఉపాహారం.2) నవాహోరాత్ర పారాయణం. దేవి సన్నిధిలో తొమ్మిది రోజులు నిరంతర పారాయణం జరుగుతుంది.నవరాత్రులలో ఎప్పుడైన వచ్చి మీరు పారాయణం చేసుకోవచ్చును