వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి

– డిఎల్‌పిఓ శంకర్‌
నవతెలంగాణాముత్తారం: వేసవిలో గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని డిఎల్‌పిఓ శంకర్‌ అధికారులకు సూచించారు. ముత్తారం మండలంలోని ఓడేడు గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించారు. గ్రామంలో శానిటేషన్‌ను పరిశీలించారు. నర్సరీను సందర్శించారు. మొక్కల పెంపకంపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లోని ప్రజలు నీటి ఇక్కట్లు పడకుండా ఉండేందుకు అధికారులు చూడాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఆయన వెంట ఎంపిడిఓ లలిత, ఎంపిఓ బైరి వేణు మాదవ్‌ తదితరులున్నారు.