
– అందరి సంక్షేమానికి ఆరు గ్యారంటీల అమలు చేస్తామని హామీ
నవతెలంగాణ-బెజ్జంకి : రాష్ట్ర ప్రజలు తెలంగాణ వాదంపై ఉన్న అభిమానంతో బీఆర్ఎస్ పార్టీకి పదేండ్లు అధికారం కట్టబెడితే అభివృద్ధి పేరునా అంతా అవినీతికి పాల్పడి దోపిడీ చేశారని మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు.శనివారం మండల పరిధిలోని గూడెం,లక్ష్మీపూర్,వీరాపూర్, తోటపల్లి గ్రామాల్లో కవ్వంపల్లి సత్యనారాయణ మండల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అందరి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికి అమలు చేస్తామని కవ్వంపల్లి తెలిపారు.ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.