400 ఏళ్ళ గుడి నేపథ్యంలో..

In the background of 400 years old temple..బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా నూతన దర్శకుడు లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వంలో మూన్‌షైన్‌ పిక్చర్స్‌పై మహేష్‌ చందు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శివన్‌ రామకృష్ణ సమర్పిస్తున్నారు. 400 ఏళ్ల నాటి గుడి నేపథ్యంలో ఓ కల్ట్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త ఫీమేల్‌ లీడ్‌లో నటిస్తున్నారు. బుధవారం ఆమె బర్త్‌డే సందర్భంగా మేకర్స్‌ సంయుక్త పాత్రను సమీరాగా పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. మోడరన్‌ అమ్మాయిగా ఉన్న సంయుక్త పోస్టర్‌ అందర్నీ అలరిస్తోంది. ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను మునుపెన్నడూ చూడని రీతిలో ప్రెజెంట్‌ చేస్తోంది. ఈ చిత్రానికి డీవోపీ: శివేంద్ర, సంగీతం: లియోన్‌ జేమ్స్‌, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌ ఆర్‌, ఆర్ట్‌: శ్రీనాగేంద్ర తంగాల.