బీసీ బాలికల హాస్టల్ లో పప్పు భోజనమే దిక్కు..

In the BC girls' hostel, lentil meal is the direction..– మెనూ అమలు శూన్యం. 
– స్థానికంగా ఉండని వార్డెన్.
– కెవిపిఎస్ సర్వేలో సమస్యలు వెలుగులోకి.
నవతెలంగాణ – అచ్చంపేట
బీసీ బాలికల హాస్టల్ లో విద్యార్థులకు పప్పు భోజనమే దిక్కు. మెనూ అమలు చేయడం లేదు. స్థానికంగా ఉండవలసిన వార్డును చుట్టపు వలె వారంలో 3 రోజులు వచ్చి పోతుందని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గుండె మల్లేష్ అడ్వకేట్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సంక్షేమ హాస్టల్లో సమస్యల పైన కెవిపిఎస్ అధ్యయనం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే శుక్రవారం పట్టణంలోని బీసీ కళాశాల బాలికల హాస్టల్ ను సందర్శించారు. విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడారు అసంపూర్తిగా ఉన్న ప్రైవేటు భవనంలో రెండో అంతస్తులో కళాశాల హాస్టల్ నిర్వహిస్తున్నారు. 65 మంది విద్యార్థులు ఉంటున్నారు. వసతులు, సౌకర్యాలు అంతంత మాత్రమే ఉన్నాయన్నారు. రేకుల అడ్డుపెట్టీ ఒక్కో హాల్ లో 30 మంది బాలికలను ఉంచుతున్నారు. ప్రమాద స్థాయిలో మెట్లు ఉన్నాయన్నారు. బాత్రూములు సరిపోలు లేకపోవడంతో విద్యార్థినీలు ఇబ్బందులు పడుతున్నామని కెవిపిఎస్ బృందానికి తెలిపారు. లైబ్రరీ లేదు , వేడి నీళ్ల గీజర్ లేదన్నారు. ఏఎన్ఎం ను నియమించలేదు. రాత్రి వేళలో విద్యార్థినిలకు కడుపునొప్పి జ్వరం వచ్చిన వాచ్మెన్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారని తెలిపారు. ఉన్నత అధికారుల పర్యవేక్షణ కూడా లేదన్నారు. ఉదయం పూట టిఫిన్ లో పూరి ఇడ్లీ పెడితే బాగుంటుంది అని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలో చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు శ్రీను తదితరులు ఉన్నారు.