స్ట్రీట్ డాగ్ సమర్పణలో ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్ హీరో, హీరోయిన్‌గా వెంకట రత్నంతో కలిసి లక్ష్మణ్ చిన్నా స్వీయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘నచ్చినవాడు’. మిజో జోసెఫ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను పాత్రికేయుల సమక్షంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శక, నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ, ‘స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంగా చేసుకుని అల్లిన ప్రేమ కథా చిత్రమిది. విజువల్‌గానే కాకుండా పాత్రల క్యారెకటరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. కథకి అనుగుణంగా అందరిని కొత్తవాళ్లను తీసుకున్నాం. అందరు బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ మెజ్జో జోసెఫ్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. ప్రేక్షకులు ఈ సినిమా చూశాక మంచి ఫీల్‌తో ఇంటికి వెళ్తాడు. సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఆగస్టు 18న సినిమాని విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు. ‘ఇందులో నేను అను అనే క్యారెక్టర్ చేశాను. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం. చాలా నీతిగా ఉంటుంది. ఎంత కష్టం వచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోదు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన లక్ష్మణ్ చిన్నాకి ధన్యవాదాలు’ అని హీరోయిన్ కావ్య రమేష్ అన్నారు.