– జాతీయ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో జాతీయ జెండాను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవిష్కరించారు. శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి జాతీ య జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కెళ్లపల్లి రవీందర్ రావు, బోగారపు దయనంద్, దండే విట్ఠల్, నవీన్ కుమార్, రఘోత్తమ్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహ చార్యులు, బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి రమేష్‌రెడ్డి, గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి, అధికారులు, శాసనసభ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.