వైభవంగా అయ్యసాగర్‌ క్షేత్రంలో పెద్ద తేరు

– ముగిసిన త్రిపురాంతకేశ్వర ఆలయ బ్రహ్మౌత్సవాలు
నవతెలంగాణ-ఆమనగల్‌
మండలంలోని రాంనుం తల గ్రామం సమీ పంలో ఉన్న అయ్యసాగర్‌ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ త్రిపురాంతకేశ్వర వీరభద్ర స్వామి భద్రకాళి సర స్వతి శ్రీరామాంజనేయ దేవాల యాలు మహాశివరాత్రి బ్రహ్మౌ త్సవాలు మంగళవారం ముగిశాయి. బ్రహ్మౌత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారి పెద్ద తేరు కార్య క్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం చక్రతీర్థం, అమృత స్థానం, రుద్రాభిషేకం, మంగళహారతి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిశాయి. విజయవంతంగా ఉత్సవాలు జరిగేందుకు సహకరించిన భక్తులకు, ప్రజా ప్రతినిధులకు, నాయకులకు పేరుపేరునా బ్రహ్మౌత్సవాల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల నిర్వాహకులు కర్నాకర్‌రెడ్డి, ఆలయ వికాస సంఘం అధ్యక్షులు బట్టు నర్సిరెడ్డి, కార్యదర్శి ఎన్టీ పంచాక్షరి, సభ్యులు రామిరెడ్డి, వీరయ్య, యాదయ్య, యాదగిరిరెడ్డి, మాజీ సర్పంచ్‌ వడ్త్యావత్‌ సోనా శ్రీను నాయక్‌, ఎంపీటీసీ సభ్యులు సరిత పంతునాయక్‌, వైద్యనాథ్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, శేఖర్‌ అయ్యగారు పాల్గొన్నారు.