శాంతి భద్రతల పరిరక్షణలో

తెలంగాణ పోలీసులు నెంబర్‌ వన్‌ : ఎస్పీ
నవతెలంగాణ-భూపాలపల్లి
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు నెంబర్‌ వన్‌ అని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె సురేందర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా సురక్ష దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ దివాకరతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవ్వాన్ని జయశంకర్‌ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బ్లూ కోల్ట్‌ పెట్రో కార్స్‌ పెట్రోల్‌ ర్యాలీని అంబే ద్కర్‌ సెంటర్‌ వద్ద ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ దివా కరతో కలిసి ఎస్పీ సురేందర్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పి సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిచారని అన్నారు. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం పనిచేసే పోలీసు వ్యవస్థకు గత ప్రభుత్వాల నుంచి అంతగా సహకారం అందలేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణ మొదటి ప్రాధాన్యతగా గుర్తిం చిన ప్రభుత్వం, పోలీసులకు వాహనాలు, మౌళిక సదుపాయాలు, ఆధునిక సాంకే తికతను అందిస్తూ బలోపేతం చేసిందని తెలిపారు. అదనపు కలెక్టర్‌ దివాకర మాట్లాడుతూ ప్రజలను రక్షించే పోలీసుల సేవలు ప్రశంసనీయమని అన్నారు.
స్నేహపూర్వక పోలిసింగ్‌తో మమేకమవుతాం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సురక్ష దివాస్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం భూపాలపల్లి అంబేత్కర్‌ సెంటర్‌ వద్ద ఎస్పి సురేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఫుట్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లా పోలీ సులు సాధించిన విజయాలను, పోలీసు సేవలను ప్రజలకు వివరించారు. భూపాలపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత శాంతిభద్రతలను పర్యవేక్షించడంలో ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారమన్నారు. టేకుమట్ల, కాళేశ్వరం పలిమెల పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. షీ టీమ్స్‌, యాంటీ హ్యూమన్‌ ట్రాఫి కింగ్‌ యూనిట్స్‌, సఖి సెంటర్‌ , రిసెప్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. సైబర్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌, ఫింగర్‌ ప్రింట్‌ ల్యాబ్‌, వీడియో ఎనహాన్స్‌ మెంట్‌ సీడీఆర్‌ అనలసిస్‌ వంటివి జిల్లాలోనే ఉండడంతో కేసుల చేధన కు ఉపయోగ పడుతున్నాయని అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నూతన కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లా లో 86 గ్రామాల్లో 1800 సీసీ కెమెరా లు ఏర్పాటు చేసినామని అన్నారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న కరడు గట్టిన నేర చరిత్ర కల్గిన (8) మంది నేరస్తులపై పీడీ ఆక్ట్‌ నమోదు తోపాటు జిల్లా ఏర్పడిన నాటి నుండి వివిద తీవ్ర నేరాలు చేసిన వారిక శిక్షలు విధించామన్నారు. అదనపు ఎస్పీ (అడ్మిన్‌) వి శ్రీనివాసులు, అదనపు ఎస్పీ (ఏఆర్‌) శ్రీనివాస్‌, డిఎస్పీలు రాములు, రామ్మోహన్‌ రెడ్డి, కిషోర్‌ కుమార్‌, జిల్లా జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కల్లెపు శోభ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌, బుర్ర రమేష్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరిబాబు, జిల్లా పరిధిలోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ప్రజలు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.