
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులు, యువకులు ఇతర పార్టీ కార్యకర్తలు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో బషీరాబాద్ గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులు, వెంపల్లి గ్రామానికి చెందిన నాయకులు తేలు నర్సయ్య, బడా భీంగల్ గ్రామానికి చెందిన యువజన సభ్యులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పోచంపాడ్ గ్రామానికి చెందిన భాస్కర్ ఆధ్వర్యంలో గంగాధర్, రాజేష్, ఫిరోజ్, షంషేర్, పర్షీద్ తదితరులు సభ్యులు గులాబీ గూటికి చేరారు.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి ప్రశాంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.