కుసుమ పంటలో పెనుబంక ఉద్ధృతిని తగ్గించుకోవాలి

నవతెలంగాణ తాడ్వాయి :  కుసుమ పంటలో పేను బంక ఉధృతి ఎక్కువగా ఉందని, ఈ ఉధృతిని తగ్గించుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు.తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆమె బుధవారం కుసుమ, వరి పంటలను పరిశీలించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కుసుమ పంటలో ఎక్కువగా పేనుబంక ఉధృతి ఉందని తెలిపారు దీని నివారణకు అసెట్ మాప్రేడ్ 0.2 గ్రాములు ,లేదా ఇమిడాక్లోప్రైడ్ 0.3 మిల్లీలీటర్ లు పిచికారి చేసుకోవాలని సూచించారు. అలాగే వరి పంటలో ఉల్లికొడు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు వెంటనే విప్రోనిల్ మందును విచికారి చేసుకోవాలన్నారు .ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్ రెడ్డి, రైతులు వెంకట్రావు ,గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు