
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట బడ్జెట్ లో వ్యవసాయనికి అనుబంధ రంగానికి పెద్దపిట వేసిందని కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బరుపట్ల కిరిటి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ పూర్తి బడ్జెట్ రు 291191 కోట్లు కాగ అందులో వ్యవసాయ అనుబంధ రంగాలకు రు.72659 కోట్లు కేటాయించడం వ్యవసాయ రంగా అభివృద్ధి కీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుదన్నారు. రైతుల సంక్షేమానికి ఆర్థిక నిధులు కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క , మంత్రి వర్గానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.