సర్వేలో ముస్లింలు బీసీ-ఈ లో నమోదు చేసుకోవాలి

In the survey, Muslims should register in BC-E– బీసీ-ఈ పరిధిలోకి రాని వారు ఓసీ ముస్లింలుగా నమోదు చేసుకోవాలి
– మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా
నవతెలంగాణ – పాల్వంచ 
రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలందరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని భద్రాది కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 33 పేజీల దరఖాస్తు ఫారంలో బీసీ-ఈలో గల 14 ముస్లిం కులాలు మరియు 64 ఉపకులాలకు చెందిన ముస్లిం లు తప్పకుండా బీసీ లో తమ కుటుంబ సభ్యులందరి వివరాలను ఇంటికొచ్చే సర్వే అధికారులకు తెలియజేయ్యాలన్నారు. అదేవిధంగా బీసీ-ఈ పరిధి లోకి రాని 10 ముస్లిం కులాలు 19 ఉప కులాలవారు ఓసీ కాలం నందు ఓసీ ముస్లిం లు గా నమోదు చేసుకోవాలని సూచించారు. లేని యెడల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేబడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో ముస్లింలు అన్ని విధాలా నష్ట పోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం లోని ముస్లిం సోదరులందరూ సమగ్ర కుటుంబ సర్వేలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇతర సమాచారం కొరకు 8520860785నంబర్ కు సంప్రదించాలని సూచించారు.