
నేటి పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల ప్రిన్సిపాల్ నీలారాణి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలో పనిచేస్తున్న తోటి బోధన,బోధనేతర మహిళా సిబ్బందికి శాలువాతో ఆత్మీయ సన్మానం చేసి మాట్లాడారు. ఈ మేరకు సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు ముందుకెళ్లడం జరుగుతుందని,సామాజిక,ఆర్థిక, రాజకీయపరంగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకెల్లడం హర్షించదగ్గ విషయం అన్నారు. స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు అనేది సత్యమని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బింగి వెంకటేశ్వర్లు, వేణుగోపాల్,రవి,జోగ్య,ధర్మ,బిచ్య మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.