నవతెలంగాణ – నవీపేట
మండల పరిషత్ కార్యాలయంలో సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్న ప్రతిసారి సమావేశ గది సరిపోక అధికారులు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 లక్షల మండల పరిషత్ నిధులతో ఎంపీడీవో కార్యాలయంపైన సమావేశ గది నిర్మాణం పూర్తయి ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ తో ప్రారంభానికి ముస్తాబై ఉంది. దశాబ్ది ఉత్సవాలలో ప్రారంభించాలని ప్రయత్నించినప్పటికీ ఎమ్మెల్యే సమయ భావం కారణంగా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో వైద్యశాఖ సూపర్డెంట్ శ్రీనివాస్ కుర్చీ తట్టుకొని పడిపోగా కాలికి బలమైన గాయమైంది. వచ్చే సర్వ సభ్య సమావేశమైన నూతన సమావేశపు గదిలో జరుపుకోవాలని సభ్యులు ఆశిస్తున్నారు.