ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని తుడుందెబ్బ జిల్లా కార్యదర్శి మండాడి జ్ఞానేశ్వర్ అన్నారు. బుధవారం జన్నారం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. గిరిజనుడైన ఏకైక ఎమ్మెల్యే బొజ్జు పటేల్పై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. బాధ్యులను పట్టుకొని వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఆదివాసి ఎమ్మెల్యే కావడంతో జీర్ణించుకోలేక ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిని వెంటనే పట్టుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆదివాసి సంఘ నాయకులు హనుమంతరావు కనాక ధర్మారావు మరుస కోల వసంత్ ఆత్రం ప్రకాష్, పుసం సోనేరావు అడవి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.