– ఫేక్ వీడియోలతో బి ఆర్ ఎస్ నాయకుల విష ప్రచారం
నవ తెలంగాణ – కాటారం
నవ తెలంగాణ – కాటారం
ఓటమి భయంతోనే పుట్ట మధు శ్రీధర్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దండు రమేష్, ఎంపీపీ లు పంతకాని సమ్మయ్య, బాన్సువాడ రాణి బాయ్, బుచ్చక్క, జడ్పిటిసిలు గూడాల అరుణ, లింగమల్ల శారద, పాల్గొని మాట్లాడారు.
మంథని నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుట్ట మధుకర్ చేపడుతున్న పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీపై, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పై చేస్తున్న అసత్యపు ప్రచారాలను ప్రజలు నమ్మబోరని కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండించారు. వాస్తవ విరుద్ధమైన ఆరోపణలతో, పబ్బం గడుపుకోవడమే పుట్ట మధు లక్ష్యంగా పెట్టుకున్నాడని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో భూపాలపల్లి పరిసరాలలో బొగ్గు బావులు, వాటికి అనుకూలత కలిగి ఉండడం వల్లనే అక్కడ జెన్కో కంపెనీని ఏర్పాటు చేశారని ఆ విషయం తెలుసుకోకుండా అసత్యపు ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. సహాయ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి నిజాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని కాంగ్రెస్ నాయకులు హితువు పలికారు. జెన్కో ఏర్పాటు విషయంలో భూపాలపల్లి పరిసరాలలో బొగ్గు బావులు, వాటి అనుకూలత కలిగి ఉండడం వల్లనే అక్కడ జెన్కో కంపెనీ ఏర్పాటు చేశారన్న విషయం అధికారిక సమాచారం అని ప్రజలు గుర్తించాల్సిన అవసరం అని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అవసరమయ్యేంత భూమి కాటారం మండలం లేదని అన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలంటే అనువైన స్థలం, బొగ్గు నిల్వలు, నీటి లభ్యత, క్యారెక్టర్ ఆఫ్ లోడ్, స్టేషన్ కెపాసిటీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. జెన్కో ఏర్పాటు ఎప్పుడూ అయిందో తేదీలు కూడా తెలియని నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. తాడిచెర్ల కోల్ మైన్ ను బి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక ఒక ప్రైవేటు సంస్థకు కేటాయించారని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పుట్ట మధు ఎన్ని కోట్లు తీసుకున్నారని అన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంథని నియోజకవర్గంలో జరుగుతున్న బొగ్గు, ఇసుక, మట్టి దందాలు పై కమిటీ వేసి విచారణ చేపడుతామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. లేనిపోని మాటలతో ప్రజలను అయోమయానికి గురి చేయాలని ఒత్తిడితో ఉన్న పుట్ట మధు కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. శ్రీధర్ బాబు పై ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తులపై పోలీసులు విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో , పిసిసి మహిళా విభాగం కార్యదర్శి సుగుణ, , మండల అధ్యక్షులు వేములూరి ప్రభాకర్ రెడ్డి, బడితల రాజయ్య, రాజబాపు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కర్ణాకర్, సర్పంచ్ బాసని రఘువీర్, ఎంపీటీసీలు జాడి మహేశ్వరి, మహేష్ రవీందర్ రావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చీమల సందీప్ తదితరులు పాల్గొన్నారు…