నవతెలంగాణ-ముధోల్ : మండలంలోని ఆష్ట గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారి చేతుల రేపటి నుండి 5 వతేది వరకు సీతారామ లక్ష్మణ ఆంజనేయ సాహిత ఆదిత్యాది, నవగ్రహ పూర్వక ధ్వజ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని రామాలయ నిర్వాహక కమిటీ , గ్రామస్థులు తెలిపారు. నేడు గణపతి పూజ కుటీర హోమం గోపూజ యాగశాల ప్రవేశం ఉంటుందన్నారు. 4న హోమంలు,తీర్థ ప్రసాద వితరణ, ఆయా కార్యక్రమాలు ఉంటాయన్నారు. 5 తేదిన రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందని వారు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఒక్కొక్క రోజు కళాకారులచే భక్తులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అన్నదానం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావాలని వారు కోరారు.