
మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కమ్మర్ పల్లిలో ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి, బషీరాబాద్ లో మండల పరిషత్ కార్యాలయ సూపరిండెంట్, పంచాయతీ ప్రత్యేక అధికారి మైలారం గంగాధర్ ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమై నేటితో 18 సంవత్సరాలు పూర్తయి, 19వ సంవత్సరాలోకి అడుగు పెడుతున్న సందర్బంగా వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం కూలీలకు కేక్, స్వీట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లిలో పీల్డ్ ఆసిస్టెంట్ రమ, బషీరాబాద్ లో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సక్కారం అశోక్, నాయకులు ఎస్. నారాయణ, కె. శ్రీనివాస్, దేవేందర్, శ్రీనివాస్, సంజీవ్, రాకేష్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, మెట్లు సురేష్, శ్రీనివాస్, స్వప్న, కూలీలు, తదితరులు పాల్గొన్నారు.