ఆగోపే హౌలిస్టిక్‌ న్యూరో క్లినిక్‌ ప్రారంభం

నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
హనుమకొండ లోని పబ్లిక్‌ గార్డెన్‌ ఎదురుగా రంజిత్‌ బార్‌ లైన్‌ లోని నూతనంగా ఏర్పాటు చేసిన కైరోప్‌ ప్రాక్టీస్‌ మిషన్‌ను డాక్టర్‌ ప్రదీప్‌ ఆర్థోపెటిక్‌ ప్రారంభించడం జరిగింది. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా చికిత్స కైరోప్‌ ప్రాక్టీస్‌ అమెరికా ట్రీట్మెంట్‌ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా అమెరికాలోని 12 వేల రూపాయలు, హైదరాబాదులో 7000 రూపాయలు, కానీ ఇప్పుడు వరంగల్‌లో వెయ్యి రూపాయలకు ట్రీట్మెంట్‌ చేయడం జరు గుతుం దన్నారు. పేదవారు దీనిని ఉపయోగించుకోవా లని తెలిపారు. డాక్టర్‌ సుబ్రహ్మణ్యం మాట్లా డుతూ న్యూరో ఆర్తో మెదడుకు సంబంధించిన సమస్యలకు ఎటువంటి ఆపరేషన్‌ లేకుండా 1000 మందిని బెడ్‌ పై ఉన్న వారిని నడిచేలాగా చేయగలగడం తమ ప్రత్యేకత అన్నారు. మోకాళ్ల నొప్పులపై 12 సంవత్సరాల నుండి చేసిన పరిశో ధన ఫలించి మోకాళ్ల నొప్పులకు శాశ్వత పరి ష్కారం చూపామన్నారు. ఎలాంటి ఆప రేషన్‌ లే కుండా, పేదవారికి సహాయం చేయడానికి ముం దుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రగాలాత్‌ కుమార్‌, డాక్టర్‌ పూర్ణ, డాక్టర్‌ రాము తదితరులు పాల్గొన్నారు.