– పోస్టర్ ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఝాన్సీ
– పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అల్లూరి విజయ్
నవతెలంగాణ – హైదరాబాద్:
ఆంధ్ర మహిళ సభ కాలేజీలో బహుజన బతుకమ్మ పోస్టర్ ను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఝాన్సీ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ, స్త్రీలు గౌరవంగా జీవించే హక్కును చాటి చెబుతూ అక్టోబర్ 2 నుండి 10 వరకు జరిగే బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. స్త్రీ-పురుష సమానత్వాన్ని, మహిళలపై హత్యాకాండను, ఆడబిడ్డలను ఎదగనిద్దాం బతకనిద్దాం అంటూ అన్ని హక్కులను కాపాడుకునేందుకు బహుజన బతుకమ్మ అందుకోసం పోరాడుతుందని తెలిపారు. అలాగే శుక్రవారం ఓయూ విద్యార్థులచే ఆర్ట్స్ కాలేజీ దగ్గర జరిగే బహుజన బతుకమ్మ ఆట పాట కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలందరూ భాగస్వామం కావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా సభ కళాశాల , ఉపాధ్యాయులు రాజ్యలక్ష్మి, రమ్యశ్రీ, పీడీఎస్ యూ (విజృంభణ) మహిళా నాయకులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.