ఏర్గట్లలో భారత్ పెట్రోలియం సూపర్ మార్కెట్ ప్రారంభం..

నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలో గల భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారిచే గాయత్రి ఫిల్లింగ్ స్టేషన్ లో ఇన్ అండ్ అవుట్ సూపర్ మార్కెట్ ను నిజామాబాద్ టెరిటరీ మేనేజర్ బి.శ్రవణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా బంక్ యజమాని సిగసారం గంగారాం మాట్లాడుతూ…పల్లె ప్రజలకు నాణ్యమైన వస్తువులను అందించాలనే ఉద్దేశ్యంతో సూపర్ మార్కెట్ ప్రారంభించడం జరిగిందని,ఇందులో ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులను సరసమైన ధరలకే అందుబాటులో ఉంచామని అన్నారు.ఈ కార్యక్రమంలో సేల్స్ అధికారి రితీష్ కుమార్,ఇన్ అండ్ అవుట్ మేనేజర్ ఓం నమః శివాయ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.