
నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ నగరంలోని మున్సిపల్ కార్యాలయం ముందు చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్వర్గస్తులైన తన యొక్క తాతయ్య నానమ్మ బెల్లాల్ మాణిక్ రెడ్డి జానకి బాయిల స్మారకంగా గత మూడు సంవత్సరాలుగా ప్రతి వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు శైలి బెల్లాల్ తెలిపారు. ప్రతినిత్యము నగరానికి ఎంతోమంది వివిధ పనుల కోసం వస్తుంటారని వేసవి వేడికి తాళలేక దప్పికతో ఇబ్బంది పడుతుంటారని వారి యొక్క అవస్థలను గమనించే ప్రముఖ చౌరస్తా అయినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆవిడ తెలిపారు.మూడు సంవత్సరాలుగా చలివేంద్రంలో మినరల్ వాటర్ ను అందుబాటులో ఉంచుతున్నామని ఈ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నీటిని వృధా చేయకుండా కాపాడాలని ఆవిడ కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత పంచాయతీరాజ్ అధికారి బెల్లాల్ వినయ్ కుమార్, నవత, పవన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.