కామ్రేడ్ డివి కృష్ణ వర్ధంతి కరపత్రాల ఆవిష్కరణ

నవతెలంగాణ- రామారెడ్డి
ఆచరణాత్మక ప్రజా పంత సిద్ధాంత రూపకర్త, భారత విప్లవోద్యమ నేత కామ్రేడ్ డివి కృష్ణ విప్లవ కారులకు ఆదర్శమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ శనివారం అన్నారు. మండలంలోని అన్నారం గ్రామంలో డివి కృష్ణ స్మారక స్తూపం ఆవిష్కరణ, వర్ధంతి కరపత్రాలను ఆవిష్కరించారు. కామ్రేడ్ డివి కృష్ణ ఉద్యోగాన్ని వదిలి విప్లవోద్యమ నిర్మాణంకు కృషి చేసిన ఆదర్శప్రాయుడని కొనియాడారు. సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా విప్లవ పార్టీలు తమను సైద్ధాంతికంగా తీర్చి దిద్దు కోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన గొప్ప నేత అని అన్నారు. నేటి విప్లవ తరానికి కామ్రేడ్ డివి కృష్ణ మార్గదర్శకుడు అని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండవ వర్ధంతి తో పాటు, స్మారక స్తూపం ఆవిష్కరణ జూన్ 26న ఉన్నందున విప్లవ కారులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆర్ రమేష్, జి సురేష్, కిషోర్, దామోదర్, ఎస్ కిషోర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.