
నవతెలంగాణ – భువనగిరి రూరల్
భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో మంగళవారం ఉదయం భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గ్రామంలో ప్రజల ప్రజల సంరక్షణార్థం కోసం సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రెండు కోట్ల 80 లక్షల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది. పాఠశాల కాంపౌండ్ వాల్ , ఎస్సీ కమిటీ హాల్,సీసీ రోడ్లు , యాదవ సంఘం భవనం , ముదిరాజ్ కమిటీ హాల్ , ధర్మ సత్రం , మినీ ఫంక్షన్ హాల్ గ్రామంలోని ప్రధాన కూడలిలలో సుమారు 12 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించిన అనంతరం గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఒక సీసీ కెమెరా 100 పోలీసులతో సమానమని అపరిచిత వ్యక్తులు ఎవరైనా గ్రామంలో కనబడితే వెంటనే 100కు డయల్ చేయాలని గ్రామస్తులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 50 రోజులకే కొన్నివేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేటాయించడం హర్షణీయ దగ్గ విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల , జడ్పిటిసి బీరు మల్లయ్య , ఎంపీటీవో నరేందర్ రెడ్డి , ఎంపీటీసీ ఉడుత శారద ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.