నవతెలంగాణ – సిరిసిల్ల
ముఖ్య ప్రణాళిక శాఖ తయారు చేసిన జిల్లా గణాంక దర్శని రాజన్న సిరిసిల్ల జిల్లా హ్యాండ్ బుక్ అఫ్ స్టాటిస్టిక్స్- 2022-23′ ను విడుదల చేశారు. శుక్రవారం ఐ.డి.ఓ.సి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రమును ప్రగతి ప్రథములో నడిపించుటకు గణాంకాలు అయువు పట్టు అని, ఈ సమాచారం అందరికి ఉపయుక్తముగా ఉంటుందని తెలుపుతూ గణాంక శాఖ జి.ఎస్.డి.పి, తలసరి ఆదాయము లెక్కింపు చేసి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ప్రపంచానికి తెలుపుటలో తోడ్పడుతుందని తెలిపారు. ఈ గణాంక దర్శిని పుస్తకం ద్వారా గణాంకలు రూప కల్పన మరియు డాటా ఆధారంగా పలు నిర్ణయాలు తీసుకోవటం లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని పలు అంశం పై డాటా సేకరణ మరియు విశ్లేషణ వలన జిల్లా అభివృద్ది కి తోడ్పడుతున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి పూర్ణ చంద్ర రావు, ఉప గణాంక అధికారులు బి . చంద్రమౌళి, ఎన్. శ్యాంసుందర్, సీనియర్ సహాయకులు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.