– నగరంలో ఇది ఆరో హాస్పిటల్
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
అత్యాధునిక డెంటల్ కేర్‌కు ప్రసిద్ధి చెందిన డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్‌ను హైదరాబాద్‌లోని పుప్పాల గూడలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..అత్యాధునిక డెంటల్ కేర్ హాస్పిటల్‌ను ప్రారం భించినందుకు సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన దంత సంరక్షణ సేవలు ప్రజలకు అందించాలని కోరారు. డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ 55 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ వ్యవస్థా పకుడు, సీఎండీ ఎమ్‌ఎస్ గౌడ్ మాట్లాడుతూ నగరంలో ఇది ఆరో హాస్పిటల్ అన్నారు. హైదరాబాద్‌లో డిజిటల్ డెంటల్ ప్రాక్టీస్‌లో ముందంజలో ఉందన్నారు. పేషెంట్ కేర్, డెంటల్ ట్రీట్‌మెంట్ కచ్చితత్వం కోసం ఏఐని ఉపయోగిస్తున్నామని తెలిపారు. కోటి, సికింద్రాబాద్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలిలో హాస్పిటల్స్ కలవన్నారు. ఈ హాస్పిటల్ ప్రపంచ ప్రమాణాలకు అను గుణంగా సమకాలీన, అధునాతన దంత సంరక్షణ అంది స్తుందన్నారు. అత్యంత అనుభవజ్ఞులైన దంత వైద్య నిపు ణులు ఉన్నారన్నారు. డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ ఆర్థోడాంటిక్స్, డెంటో ఫేషియల్ ఆర్థోపెడిక్స్ సీఈవో డాక్టర్ స్నిగ్ధా గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్1967 నుంచి దంత సంరక్షణలో అగ్రగామిగా ప్రసిద్ధి చెందిందన్నారు. దక్షిణ భారతదేశంలో దంత పరిశ్రమకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరి చయం చేసిన గొప్ప చరిత్రను కలిగి ఉందన్నారు. వివిధ అత్యాధునిక సాంకేతికతలను అమలు చేయడంతో 1967 నుంచి ఆవిష్కరణ పట్ల మా నిబద్ధత కని పిస్తుందన్నారు. 1984లో కాస్మెటిక్ డెంటిస్ట్రీని ప్రవేశ పెట్టడం, 1990లో డెంటల్ లేజర్‌లు, 1998లో ఇం ప్లాంట్లు, 2015లో క్లియర్ అలైన్‌నర్‌లు ప్రవేశపెట్ట మని తెలిపారు. దంత సంరక్షణలో కొత్త ప్రమాణా లను నెలకొల్పామని చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో తరతరాలుగా చిరునవ్వులు చెందించడంలో ముం దంజలో ఉన్నామన్నారు. దంత సంరక్షణలో అగ్రగామి డాక్టర్ ఎంఎస్ గౌడ్ అన్నారు.డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ విభిన్న దంత అవసరాలు తీర్చనుంద న్నారు. ఐటెరో ఎలిమెంట్ 5డీ ప్లస్ స్కానర్‌లు, ట్రియోస్ 5 స్కానర్‌లు, 3డీ ప్రింటర్లు, సీఏడీ-సీఏఎం ఆధారిత ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కచ్చితమైన రోగ నిర్ధారణ చేయనుందని తెలిపారు. దంత సంరక్షణలో ఏఐ సాంకేతికతను సమగ్రపరచడం, రోగి సౌలభ్యం, చికిత్స ఫలితాలు వంటి అధునాతన పద్ధతుల ను హాస్పిటల్ అమలు చేస్తుందన్నారు. ఈ ప్రాంతంలో నాణ్యతతో కూడిన దంత సంరక్షణ కోసం పెరుగుతున్న డిమాండ్ దష్ట్యా అధునాతన దంత చికిత్సలను మరింత మందికి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఈ విస్త రణకు కారణమని తెలిపారు. పుప్పాలగూడ క్లినిక్ అల్ట్రా ఆధునిక దంత సంరక్షణ అందించనుందన్నారు. అందమై న, ఆరోగ్యకరమైన చిరునవ్వుల కోసం రోగులకు స్నేహ పూర్వక వాతావరణంలో అత్యుత్తమ సంరక్షణే లక్ష్యమ న్నారు. డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్‌ను ఇతరుల నుంచి భిన్నంగా ఉంచేది ఏమిటంటే.. ఆవిష్కరణ, రోగి సంతప్తి, దంత సంరక్షణలో శ్రేష్ఠత అన్నారు. నగరం అంతటా అనేక కేంద్రాలతో డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ ప్రతి రోగి ప్రత్యేక అవసరాలను తీర్చే సమగ్ర దంత సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ చీఫ్ కాస్మెటిక్ డెంటల్ ఇంప్లాం టాలజిస్ట్, ఓరల్, మాక్సిల్లోఫేషియల్ ప్రోస్టోడాంటిస్ట్ డైరెక్టర్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ హైదరాబాద్‌లో దంత సంరక్షణలో ముందంజ లో ఉందన్నారు. నాణ్యమైన దంత సంరక్షణ అందించాల న్న దడ సంకల్పం, అంకితభావం, సాంకేతిక పురోగతితో ముందుకు వెళ్తుందన్నారు. అధునాతన దంత సంర క్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కట్టుబడి ఉందన్నారు.