గౌడ సంఘం ఐక్యవేదిక పోస్టర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘం ఐక్యవేదిక పోస్టర్ హుస్నాబాద్ గౌడ సంఘం నాయకులు  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ  ఈనెల 10 తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాచెర్ల ప్రసాద్ గౌడ్ , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ సంఘం కోశాధికారి పొన్నం శ్రీనివాస్ గౌడ్, జిల్లా గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి మాచెర్ల అంజన్న గౌడ్,హుస్నాబాద్ గౌడ సంఘం అధ్యక్షులు పూదరి వరప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.