ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Inauguration of Grain Purchase Centreనవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని కన్నెపెల్లి లో ఎం ఎ సి ఎస్(మాక్స్) ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓమ్రా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలకే విక్రయించాలన్నారు. “ఏ” వన్ గ్రేడ్ వరి ధాన్యానికి కింటాకు రూ. 2,320, సీ గ్రేడ్ ధాన్యానికి రూ.2300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు కాక సారయ్య, కాక కిరణ్, మ్యాక్స్ సంఘం అధ్యక్షురాలు మేడిశెట్టి ఓమ్రా, మాజీ వార్డ్ మెంబర్ గొంది అప్పాయమ్మ, నిర్వాహకుల (కల్లం ఇంచార్జ్) గొంది సరిత, కారోభార్ దెబ్బగట్ల నారాయణ, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.