నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రజలకు ఎన్నో విధాలుగా సేవ చేస్తున్న విషయం నియోజక వర్గ ప్రజలకు సుపరిచితమే.ఇదే తరుణంలో హైదరాబాద్ లోని కొంపల్లి దగ్గర శనివారం కాంగ్రెస్ పార్టీ చీఫ్ వినయ్ కుమార్ రెడ్డి ,వారి సతీమణి అనన్య రెడ్డి చే వెల్ నెస్ హాస్పటల్ ను ప్రారంభించడం జరిగింది.ఇందులో భాగంగా క్యాథల్యాబ్ సెంటర్ ను కూడా ప్రారంభించిన తర్వాత హాస్పటల్ యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్స్ అయినటువంటి సుమన్ గౌడ్ తాళ్ళ, ఎండీ అసద్ ఖాన్,వివేకానంద రెడ్డి,మెడికల్ డైరెక్టర్ కోరుట్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు జె ఎన్ వెంకట్ కు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జి ఎస్ రెడ్డి కి శుభాభినందనలు తెలుపుతూ ప్రజలకు ఆరోగ్యం విషయంలో మంచి సేవ చేస్తూ ఇంకా ఎన్నో శిఖరాలను అధిరోహించాలని కోరినారు. హాస్పటల్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తూ సహాయం అన్న పేరుకు నిర్వచనం అని హాస్పటల్ ప్రారంభం చాలా సంతోషంగా ఉందని తెలిపి శాలువాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యజమాన్యం తదితరులు పాల్గొన్నారు.