– కౌన్సిలర్ మురళీకృష్ణ
నవతెలంగాణ-ముషీరాబాద్
హైదరాబాద్ జిందాబాద్ పర్యావరణం, ప్రజా ఆరోగ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్న కృషి అభినందనీయమని వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ రీజనల్ కౌన్సిలర్ మురళీకృష్ణ అన్నారు. హైదరాబాద్ జిందాబాద్ సంస్థ ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడు తూ హైదరాబాద్ జిందాబాద్ పర్యావరణం, ప్రజా ఆరోగ్యం, సాంస్కృతిక కార్యక్రమాల చేస్తున్న కృషిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని, నగర అభివృద్ధికి హైదరాబాద్ జిందాబాద్ చేసే కార్యక్రమాలకు తమ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సమస్యగా కాలుష్యం తయారవుతున్నదని, దాని కారణంగా ప్రపంచంలో ప్రతి సంవత్సరం 95 లక్షల మందికి పైగా చనిపోతున్నారన్నారు. మనదేశంలో 25 లక్షలకు పైగా చనిపోతున్నారని, మొదటి, రెండు స్థానాల్లో మనదేశం ఉందని తెలిపారు. ప్రభుత్వాలు, సంస్థలతో పాటు ప్రతి ఒక్కరు మారాలని పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, మాజీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శంకర్రావు, వాకర్స్ నాయకులు బబ్బులు, స్కైలాబ్ బాబు, కిషన్ రావు, రవి, చందు, రఘురాం రెడ్డి, రమేష్, మాణిక్ రావు, సత్యనారాయణ, సునీల్, గిరిధర్, శ్రీదేవి, పద్మ, హైదరాబాద్ జిందాబాద్ నగర నాయకులు వీరయ్య, నాగేశ్వరరావు, మోహన్ నాయుడు, నాగేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.