మండల కేంద్రంలోని రామాలయంలో బుధవారం లక్నవరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. లక్నవరం ఫోటోగ్రాఫర్ల సర్వసభ్య సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యుడు భూపతి రామకృష్ణ డివిజన్ అధ్యక్షులు నర్రా రఘువీర్ ఆధ్వర్యంలో గోవిందరావుపేట మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా ఫోటోగ్రాఫర్ల డైరీని ఆవిష్కరించడం జరిగింది. లక్నవరం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పొన్నగంటి దేవేందర్రావు (లక్ష్మీ స్టూడియో)ప్రధాన కార్యదర్శిగా అంబాల మురళి (వంశి స్టూడియో) కోశాధికారిగా కుమ్మరికుంట్ల పరశురాం(వాసు స్టూడియో)
ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ముడి సరుకుల ధరలు పెరిగినందున వాటికి అనుగుణంగా సంఘం నిర్ణయించిన ధరలకు సంఘం యొక్క సభ్యులు అందరూ సంఘానికి కట్టుబడి ఉంటామని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ఐలయ్య, స్వామి,శ్రీకాంత్, రాము, సురక్షిత్ కుమార్ పాల్గొన్నారు.