తాడిచెర్ల హైస్కూల్లో మహళా దినోత్సవ కరపత్రం ఆవిష్కరణ

నవతెలంగాణ – మల్హర్ రావు
ఈ నెల 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం పాఠశాల ప్రదనోపాధ్యాయుడు మల్కా భాస్కర్ రావు ఆధ్వర్యంలో  అంతర్జాతీయ మహిళ దినోత్సవ కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినం స్పూర్తితో ఈ నెల 7న మధ్యాహ్నం 12 గంటలకు టిఎస్ డబ్ల్యూ ఆర్ఎస్ చిట్యాలలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే మహిళ సదస్సులో ఎక్కువ మంది మహిళ టీచర్స్ పాల్గొని మహిళ సదస్సును విజయవంతం చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పి.రమణ రెడ్డి,ప్రధాన కార్యదర్శి ఏ.తిరుపతి లుపిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.