మాలల మహా పాదయాత్ర కరపత్ర ఆవిష్కరణ

Inauguration of Malala Maha Padayatra Pamphletనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు  పిల్లి సుధాకర్ నేతృత్వంలో ఈనెల 25న భద్రాచలంలో మొదలై 38 రోజులు చేపట్టే మాలల మహా పాదయాత్ర కరపత్రాన్ని బుధవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  దళితులను విడదీసే కుట్రలో రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తుగడలో భాగమే ఎస్సీ వర్గీకరణ అంశమని అన్నారు .దానిని తిప్పి కొట్టి దళితులంతా కలిసే ఉండి రాజ్యాధికారం వైపున అడుగులు వేయాలనే ప్రయత్నంలో భాగమే మాలల మహాపాదయాత్ర చేపడుతున్నామని అన్నారు. ఈ పాదయాత్ర  డిసెంబర్ 1న రవీంద్రభారతిలో ఉంటుంది కావున మాలలు మాల అనుబంధ కులాలు ఉద్యోగులు, విద్యార్థులు మహిళలు అందరూ అధిక సంఖ్యలో  పాల్గొని  మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ కన్వీనర్ ఆరె కిశోర్, నియోజకవర్గ మీడియా సెల్ కన్వీనర్ జాల శ్రీనివాస్, మండల అధ్యక్షులు హరీష్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి బందెల హరీష్ బాబు, అక్కన్నపేట మండల కన్వీనర్స్ గిరిమల్ల గిరి ప్రసాద్, కామాద్రి రాజశేఖర్, మైల రామ్, గిరిమల్ల వంశీ, బూరుగు శ్రీకాంత్, సుంకే హరి, పంతగాని శివశంకర్ పాల్గొన్నారు.