– శంషాబాద్ వైస్ ఎంపీపీ నీలం మోహన్ నాయక్
నవతెలంగాణ-శంషాబాద్
లంబాడి జాతి ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జగదంబ భవాని మాత విగ్రహ ప్రతిష్టాపన మహౌత్సవం ఈ నెల 23వ తేదీన మదనపల్లి పాత తం డాలో నిర్వహిస్తున్నామని శంషాబాద్ మండలం వైస్ ఎంపీపీ నీలం మోహన్‌నాయక్ అన్నారు. సోమవారం ఆ మె మీడియాతో మాట్లాడుతూ లంబాడి జాతిని ఏకంచేసి ఆత్మగౌరవ బతికేలా చేసిన ఆ జంటకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో సేవాలా ల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మించారన్నారు. ఈ కార్య క్రమం గ్రామ మాజీ సర్పంచ్ వాంక్డ వాత్ రవీందర్ నాయ క్, వైస్ ఎంపీపీ నీలం మోహన్ నాయక్ గ్రామ ఉపసర్పం చి వార్డు సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. కార్యక్రమానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌కు ఆహ్వాన పత్రిక
సేవాలాల్ మహారాజ్-జగదంబ భవాని మాత విగ్రహ ప్రతిష్టాపన మహౌత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ వారు రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే టి ప్రకాష్ గౌడ్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు కే చంద్రా రెడ్డి, నీరటి రాజు ముదిరాజ్,గ్రామ మాజీ సర్పంచ్ రవీం దర్ నాయక్, వైస్ ఎంపీపీ నీలం మోహన్, మదనపల్లి మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు గౌడ్ తదితరులున్నారు.