
సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఎన్.రవి కిరణ్ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యలయంలో మంగళవారం నవతెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించారు. నవ తెలంగాణ కుటుంబ సభ్యులకు, సికింద్రాబాద్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాపాలనలో పత్రికలు, ప్రజలు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నగర అభివృద్ధికి పత్రికలు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ రిపోర్టర్ తలారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.