నవతెలంగాణ – ఓయూ: సికింద్రాబాద్ సర్కిల్ – 29 డిప్యూటీ కమిషనర్ డి.సుభాష్ రావు, మంగళవారం తన కార్యక్రమంలో నవతెలంగాణ నూతన సంవత్సర క్యాలెండర్స్, స్థానిక సీనియర్ నవ తెలంగాణ రిపోర్టర్, ఓయూ పీహెచ్డీ స్టూడెంట్ తలారి. శ్రీనివాసరావుతో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ సర్కిల్ 29 పరిధిలోని అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి మరియు నవతెలంగాణ యాజమాన్యనికి, కుటుంబ సభ్యులకు, విలేకరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో సికింద్రాబాద్ అభివృద్ధికి అందరు కలిసి కట్టుగా పని చేయాలని కోరారు. కొత్త సంవత్సరంలో భగవంతుని ఆశీర్వాదంతో ఇటు సర్కిల్ అటు ప్రజలు అభివృద్ధి చెందలని కోరారు. సమిష్టి కృషి తోనే అభివృద్ధి సాధ్యం అని తెలిపారు.