నూతన గ్రామపంచాయితీ భవనం ప్రారంభం..

నవతెలంగాణ- వలిగొండ రూరల్

మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ గుడిసె రాజేశ్వరి నరసింహ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించడం జరిగింది. అనంతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల మల్లేష్ యాదవ్, ఉప సర్పంచ్ గూడూరు కృష్ణారెడ్డి, గ్రామ కార్యదర్శి శృతి, వార్డ్ మెంబర్స్ మేరెడ్డి అరుణ, బుంగపట్ల రాజేశ్వరి కందుల బాలేశ్వర్, శంకరి బాలరాజు, కో ఆప్షన్ మెంబర్స్ కనకబోయినరసింహ, కేశ బోయిన రాణి, దేశి రెడ్డి వీరారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బంది కారోబార్ శ్రీనివాస్, నకరికంటి యాదయ్య, పుల్లమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.