మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో నూతన పంచాయతీ రాజ్ సబ్ ఇంజనీరింగ్ కార్యాలయంను ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బడే నాగజ్యోతి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ నాగజ్యోతి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సేవలను వినియోగించుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దూర ఆలోచన వలనే అభివృద్ధి జరుగుతుందనీ ములుగు జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ని,మమ్ములను ప్రతిపక్ష అయిన మీరు విమర్శించిన వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు పూర్తిగా తెలుసునన్నారు.రాష్ట్రంలో గత పరిపాలన చేసిన ప్రభుత్వల కంటే ప్రజలు మాకు ఇచ్చిన 9 ఏండ్ల పాలనలో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం.రేపు మళ్ళీ రాబోయే ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వమే అని అన్నారు.ములుగు నియోజకవర్గంలో ప్రభుత్వం పైన విషము చిమ్ముతూన్న అబద్ధపు గోడలను ప్రజలు ఓటు ద్వారా బద్దలు కొట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వెన్నుదన్నుగా అండగా ఉంటారని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ తుమ్మల హరిబాబు,ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్,సురపనేని సాయి బాబు,ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు, కో ఆప్షన్ బాబర్,ఉప సర్పంచ్ అల్లంనేని హనుమంతరావు,లకావత్ నర్సింహ నాయక్,మధు సుధన్ రెడ్డి,అక్కినపల్లి రమేస్ తదితరులు పాల్గొన్నారు.