“పీఏసీఎస్” ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Inauguration of "PACS" Grain Purchase Centreనవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని నార్లాపూర్ లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్, తాడ్వాయి (పీఏసీఎస్) వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ సీఈవో స్వాతి, ఏ ఈ ఓ రాజకుమార్ లు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలకే విక్రయించాలన్నారు. “ఏ” వన్ గ్రేడ్ వరి ధాన్యానికి కింటాకు రూ.2,320, సీ గ్రేడ్ ధాన్యానికి రూ.2300 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు (కల్లం ఇంచార్జ్) మొక్క దుర్గయ్య, నునావత్ శ్రీను, రైతులు ఎనగంటి లక్ష్మయ్య, సంజీవరెడ్డి, ఊకే భూపతి, నరేందర్, బండి నాగేశ్వరావు, కుక్కల బిక్షపతి, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.