
మండలం లోని ధని గ్రామంలో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎఎంసి చైర్మన్ అది ఆలూరు పిఎసిఎస్ చైర్మన్ మాణిక్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోని పండించిన పంటను విక్రహించి మొదటి రకం క్వింటాలుకు రూ.2320/- రెండవ రకం రూ.2300/- ప్రభుత్వం మద్దతు ధర ను పొందాలన్నారు అనంతరం ఇటీవల మార్కెట్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ హదిని,ఇటీవల బదిలీ పై వచ్చిన వ్యవసాయ అధికారి లను గ్రామస్థులు శాలువాతో సన్మానించారు .
ఈ కార్యక్రమంలో మాజీ అడెల్లి చైర్మన్ ఐటి చందు, మాజీ సర్పంచ్ లక్ష్మీ – చిన్నయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ముత్యం రెడ్డి,నాయకులు ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్, బడి పోతన్న,మల్లేష్, రైతులు పాల్గొన్నారు.