వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Inauguration of Paddy Grain Buying Centreనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ వరి  కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్  రేగుంట దేవేందర్, ఏఎంసి చైర్మన్  పాలెపు నరసయ్య  చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి, అమ్మి మోసపోవద్దు అని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుంది అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్  సుంకేట బుచ్చయ్య, సొసైటీ డైరెక్టర్  రెoజర్ల మహేందర్, మండల వ్యవసాయ అధికారిణి రమ్యశ్రీ, వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్, సంఘ డైరెక్టర్లు, విండో కార్యదర్శి శంకర్, గ్రామ రైతులు, సంఘ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.