
పట్టణంలోని కోర్టు బార్ అసోసియేషన్ వద్ద బీసీల సదస్సు కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. నేడు పట్టణంలో జరిగే బీసీల సదస్సు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ కోరారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంట్ ఇంచార్జ్ దేగాం యాదగౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తెడ్డు నర్సయ్య, న్యాయవాదులు కిష్టయ్య, ప్రవీణ్, అజిత్, రాములు, రాకేష్, మోహన్, సుభాష్, గణేష్, శ్రవణ్, వంశీ, నందిన్, కిరణ్, సంజీవ్ శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు.