పిజిఐఎం నుంచి రిటైర్మెంట్‌ ఫండ్‌ ఆవిష్కరణ

ముంబయి: పిజిఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ కొత్తగా రిటైర్మెంట్‌ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది.ఈ ఫండ్‌ ఐదేళ్లు లేదా పదవీవిరమణ వయస్సు వరకు లాక్‌-ఇన్‌ పిరియట్‌ కలిగి ఉంటుందని పేర్కొంది.ఏప్రిల్‌ 09 వరకు తెరిచి ఉంచబడుతుందని ఆ సంస్థ తెలిపింది. ఈ నిధులను బిఎస్‌ఇలోని 500 సూచీల్లో పెట్టుబడిగా పెట్టనున్నట్లు పేర్కొంది.