ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగడపల్లిలో ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు భార్గవి గారి చేతుల  మీదుగా మంగళవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాములు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూతబడిన పాఠశాలలన్నిటిని పునః ప్రారంభిస్తామని ప్రకటించడం పట్ల ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘ పక్షాన హర్షం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటుచేసి ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు కల్పించాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అలాగే ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ లు హయ్యర్ ఎడ్యుకేషన్ చేయుటకు సంబంధించిన జీవో నెంబర్ 342 ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని మరియు జీఓ నెంబర్ 2 లో ఉన్న అడక్వసీ ని తొలగించి ఎస్సీఎస్టీ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కోశాధికారి దుబ్బాక యాదయ్య పాఠశాల ఉపాధ్యాయులు శ్రీరాములు నర్సింగరావు మోట్ సత్తయ్య వెంకటయ్య రవికుమార్ రాజేంద్రప్రసాద్ నర్సింహా వెంకటేశ్వర రావు రమాదేవి మంగమ్మ శ్వేత, రాధిక కిరణ్ తదితరులు పాల్గొన్నారు.