నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా శ్రీనివాస రామానుజన్ హైస్కూల్ నూతన బిల్డింగు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి లు హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా శ్రీనివాస రామానుజన్ నూతన పాఠశాల బిల్డింగును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీరాములు, డైరెక్టర్లు పాండాల రాజ్ కుమార్ గౌడ్, దొమ్మాటి శ్రీశైలం, గ్రంథాలయ చైర్మన్ అవేష్ చిస్తీ, మాజీ ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, వడపర్తి తాజా మాజీ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి,వడపర్తి తాజా మాజీ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.