
విద్యార్థుల ఉన్నతికి పాటుపడండి సబ్ కలెక్టర్ మహతో వికాస్ మంగళవారం బోధన్ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో స్టేట్ టీచర్స్ యూనియన్ బోధన్ మండల శాఖ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో సబ్ కలెక్టర్ వికాస్ మహా మాట్లాడుతూ.. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది అని,సమాజంలో మనం ఏ స్థానంలో ఉన్న దానికి కారణం ఉపాధ్యాయులు అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అందిస్తే భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పెద విద్యార్డుల ఉన్నతికి కృషి చేయాలని, ఉపాధ్యాయుల సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తె ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ అర్బన్ అద్యక్షులు సలీం,ప్రధానకార్యదర్శి కిషోర్,జిల్లా కార్యవర్గ సభ్యులు బాలచంద్రం,సుధాకరరెడ్డి, వహెద్,సంజీవ్ తది తరులు పాల్గొన్నారు.