మండల కేంద్రంలోని మిస్టర్ చాయ్ టీ పాయింట్లు శుక్రవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దండబోయిన సంజీవ్ మాట్లాడుతూ.. ఆధార్ కార్డుతో డబ్బులు తీసుకునే సౌకర్యం ఏర్పాటు చేయబడిందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.